Header Banner

విజయవాడలో జాంటీ రోడ్స్ సందడి! బిజినెస్ లోనూ క్రీడల్లోనూ నమ్మకం ఎంతో ముఖ్యం!

  Sun Feb 02, 2025 19:35        Others

దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ విజయవాడలో సందడి చేశారు. ఏ రంగంలో అయినా రాణించాలంటే.. మనపై మనకు నమ్మకం ఉండాలని, ఆ తర్వాత కష్టంతో పాటు, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికలు ఉండాలని అందరిలో ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. విజయవాడలో ఏపీ బీఎన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా కాంక్లేవ్ 3.0కు జాంటీ రోడ్స్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, కోల్కతా నుంచి సుమారు 1500 మంది వ్యాపారవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 


ఈ సందర్భంగా జాంటీ రోడ్స్ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏ వ్యాపారమైనా వినియోగదారుల్లో నమ్మకం కలిగించాలని, దానిని నిరంతరం కొనసాగిస్తే ఇక తిరుగుండదన్నారు. తాను క్రికెటర్ అవుదామని నిర్ణయం తీసుకుని అడుగులు వేసే సమయంలో ఎన్నో అడ్డంకులు వచ్చినా నిలబడ్డానని చెప్పారు. చేసే పనిపైన శ్రద్ధ, లక్ష్యాలు సాధించాలనే తపన ఉండాలని వివరించారు. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయని, వాటిని తట్టుకుని నిలబడాలని.. లోపాలు సరి చేసుకుంటూ ముందుకు సాగితే విజయాలు వరిస్తాయని వ్యాపారవేత్తల్లో ఉత్తేజాన్ని నింపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Excricketer #jantiroads #vijayawada #bussiness #todaynews #flasnews #latestupdate